
TS: టెన్త్ ప్రశ్నా పత్రం లీకేజీ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జవాబు పత్రాలు మాయమయ్యాయి. పరీక్షా కేంద్రాల నుంచి జవాబు పత్రాల బండిల్స్ను అధికారులు పోస్టాఫీసులో అప్పగించారు. వారు కట్టలుగా కట్టి పోస్టాఫీస్ నుంచి ఉట్నూరు బస్టాండ్కు తరలిస్తుండగా ఆటో నుంచి ఒక బండిల్ జారిపోయింది. బస్టాండ్లో వాటిని లెక్కించగా ఒకటి తక్కువగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.