పాఠశాలకు తాళం వేసి విద్యార్థుల ఆందోళన

పాఠశాలకు తాళం వేసి విద్యార్థుల ఆందోళన....

పెద్దపల్లి జిల్లాలోని నిట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తాళం వేసి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శంకరయ్య అనే టీచర్ తోటి టీచర్లను ఇబ్బంది పెడుతున్నాడని, దీంతో వాళ్ళు సరిగ్గా చదువు చెప్పడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా, ఇతర టీచర్ల గురించి తప్పుగా చెప్తే డబ్బులు ఇస్తానని ఆశపెడుతున్నారని, కులం పేరు మీద విద్యార్థులను తిడుతున్నారని.. అబద్ధం చెప్పాలని శంకరయ్య సార్ తమను బలవంత పెడుతున్నాడని విద్యార్థులు వాపోతున్నారు.

దీంతో శంకరయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాలకు తాళం వేసి విద్యార్థులు ఆందోళ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం జిల్లాలోనే సంచలనంగా మారింది.

Updated On 6 March 2025 10:35 AM IST
Ck News Tv

Ck News Tv

Next Story