స్కూల్ వ్యాన్ కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేటలో గురువారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో స్కూల్ వ్యాన్ కిందపడి నాలుగేళ్ల ఎల్‌కేజీ విద్యార్థి చనిపోయింది.
బాలిక స్కూల్ వాహనం దిగి వెళ్తున్నంది. అదే సమయంలో డ్రైవర్ వాహనాన్ని రివర్స్ తీశాడు. బాలికను గమనించకుండానే డ్రైవర్ వెనక్కి తీయడంతో చిన్నారి టూర్ కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అక్కడికక్కడే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తున్నది.
చిన్నారి శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో చదువుతున్నది. మృతురాలుని రిత్వికగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. అయితే, పాఠశాలల యాజమాన్యాల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ స్కూల్‌కు వ్యాన్స్ ఉన్నాయని.. వాటికి ఎలాంటి పర్మిషన్లు లేవని.. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.