ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పై ఉపాధ్యాయుడి దాడి..!
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పై ఉపాధ్యాయుడి దాడి..!

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పై ఉపాధ్యాయుడి దాడి..!
హైదరాబాద్ మియాపూర్ మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి పై విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.
విద్యార్థి పై శారీరక దాడి చేసి అతని ముఖం, శరీరం పై తీవ్ర గాయాలు కలిగించినట్టు తెలుస్తోంది.
ఈ ఉపాధ్యాయుడు గతలో కూడా పలువురు విద్యార్థులపై కర్రలో దాడి చేసిన సంఘటనలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటన పై తీవ్రంగా స్పందించిన విద్యార్తి తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు.
దీంతో న్యాయం దక్కలేదని భావించిన తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడి పై తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంబించారు.
పాఠశాలలో విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయుల ప్రవర్తన పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.
