*మెట్రో రైలు లో యువతి పై అత్యాచారయత్నం*

*హైదరాబాద్ దారుణం*
*మెట్రో రైలు లో యువతి పై అత్యాచారయత్నం*
ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం కలకలంగా మారింది. సికింద్రాబాద్-మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది.
తప్పించుకునే క్రమంలో రైలు నుంచి బయటకు దూకిన యువతికి తీవ్ర గాయా లయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన వెలుగులోకి వచ్చింది. రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించడంతో తప్పిం చుకునే క్రమంలో రైలు నుంచి బయటకు దూకిన యువతికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మేడ్చల్‌లోని ఓ వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్‌గా పని చేస్తున్న ఓ యువతి (23) ఈ నెల 22వ తేదీ సాయంత్రం మేడ్చల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది.
కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద రైలు నుంచి కింద పడి, గాయపడి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు 108కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వటం తో ప్రథమ చికిత్స అందించి ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఇప్పుడు నగరంలో కలకలం రేపుతోంది.
