ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడి మృతి..


ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన బషీరాబాద్ మండల కేంద్రంలోని టాకీ తాండలో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శ్రీరామ్ (7 ) టాకీ తాండా పాఠశాలలో రెండవ తరగతి చదువుకుంటున్నాడు


తల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. పాఠశాలలో ఆటలాడుకుంటూ రోడ్డు దాటుతున్న క్రమంలో తాండూర్ నుండి క్యాద్గిరా వెళ్తున్న ఆర్టీసీ (అద్దె) బస్సు బాలుడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడు బస్సు ముద్దు టైర్ కింద పడి తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సు నడిపి తమ బాబును పొట్టబెట్టుకున్నాడని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. డ్రైవర్‌ పై మృతుడి తండ్రి రాథోడ్ వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Ck News Tv

Ck News Tv

Next Story