✕
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!
By Ck News TvPublished on 28 March 2025 2:50 PM IST
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

x
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!
బీఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు.
ఈ సందర్భంగా తన నియోజకవర్గమైన దుబ్బాకలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలని సీఎంను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరారు.
దీనిపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అంతేగాక యూనివర్సిటీ నెలకొల్పేందుకు కావాల్సిన స్థల పరిశీలనకు దుబ్బాక వెళ్లాలని సీఎంఓ కు ఆదేశాలు కూడా జారీ చేశారని తెలుస్తోంది.
అలాగే దుబ్బాక నియోజకవర్గం లో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న హబ్సీపూర్- లచ్చపేట్ కు రెండు వరుసల రోడ్డు నిర్మాణానికి రూ. 35 కోట్లు మంజూరు చేశారు. దీనికై సీఎం రేవంత్ రెడ్డికి దుబ్బాక ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు.

Ck News Tv
Next Story