పట్టపగలే కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి..
పట్టపగలే కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి..

పట్టపగలే కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి..
బంజారాహిల్స్‌లో కానిస్టేబుల్ శ్రీకాంత్ పై దాడి జరిగింది. బైక్ రేసర్ ఖాజా అనే వ్యక్తి బీరు బాటిల్‌తో కానిస్టేబుల్ తలపై దాడి చేశాడు.
ఈ ఘటనలో శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడి తల నుంచి రక్తం కారుతూ ఉంది. వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ మధ్య కాలంలో ఆకతాయిల ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్నపాటి కోపం వస్తే చాలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా బిహేవ్ చేస్తున్నారు.
చేతిలో ఏది ఉంటే దానితో దాడి చేసి.. ఎదుటి వారిని గాయపరుస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బైక్ రేసర్ దారుణానికి తెగబడ్డాడు. బైక్ వచ్చి వీరంగం సృష్టించాడు. వేగంగా వెళ్లి ఒక కారును ఢీకొట్టాడు.
అక్కడితో ఆగకుండా అడ్డు వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ తలపై బీర్ సీసాతో దాడి చేశాడు. ఈ ఘటన బంజారాహిల్స్‌లోని ఒమేగా హాస్పిటల్ వద్ద చోటుచేసుకుంది.
టోలి చౌకీ నుంచి వేగంగా దూసుకొచ్చిన బైక్ రేసర్ ఖాజా ఒమేగా హాస్పిటల్ వద్ద కారును బలంగా ఢీకొట్టాడు. దీంతో కార్ డ్రైవర్, ఖాజా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
అదే సమయంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో డ్యూటీ నిమిత్తం అదే రోడ్డులో వెళ్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ అక్కడ జరుగుతున్న గొడవ చూసి ఆగాడు.
అనంతరం వారిద్దరి గొడవని ఆపే ప్రయత్నం చేశాడు. ఇంతలో తీవ్ర ఆగ్రహానికి గురైన బైక్ రైడర్ ఖాజా బీర్ బాటిల్‌తో కానిస్టేబుల్ శ్రీకాంత్ తలపై గట్టిగా కొట్టాడు.
ఈ దాడిలో కానిస్టేబుల్ శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అందులో కానిస్టేబుల్ శ్రీకాంత్ తలపై నుంచి రక్తం కారుతూ కనిపిస్తోంది. వెంటనే శ్రీకాంత్‌ను ఆసుప్రతికి తరలించారు. ఈ మేరకు బైక్ రేసర్ ఖాజాపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్ ఫిర్యాదు చేశాడు.
