✕
మద్యం మత్తులో బైక్ ను గుద్ది.. కిలో మీటర్ ఈడ్చకెళ్లాడు..
By Ck News TvPublished on 20 March 2025 11:50 AM IST
మద్యం మత్తులో బైక్ ను గుద్ది.. కిలో మీటర్ ఈడ్చకెళ్లాడు..

x
మద్యం మత్తులో బైక్ ను గుద్ది.. కిలో మీటర్ ఈడ్చకెళ్లాడు..
ఎల్బీనగర్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ బైక్ను ఢీకొట్టాడు.
కారు ఆపకుండా బైక్ను అలాగే ఈడ్చుకెళ్తు ముందున్న మరో కారును ఢీకొట్టాడు.
ఈ ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయాల పాలైన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో కారు, బైక్ ధ్వంసం అయ్యాయి. మద్యం మత్తులో కారు నడిపిన ప్రభాకర్ రెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

Ck News Tv
Next Story