మహా శివరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం.. గర్భిణీ సహా ఇద్దరు స్పాట్ డెడ్

మహా శివరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం.. గర్భిణీ సహా ఇద్దరు స్పాట్ డెడ్


సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా అంతారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

భార్య శోభన గర్భిణి కావడంతో తల్లి లక్ష్మితో కలిసి రవి అనే వ్యక్తి బైకుపై ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా ఘటన జరిగిందని పోలీసులు నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఇటీవలే సంగారెడ్డికి చెందిన జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి కుటుంబం కుంభమేళాకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురూ అక్కడిక్కడే దుర్మరణం చెందారు.

మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మరువక ముందే సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం కలకలం రేపుతోంది.

Ck News Tv

Ck News Tv

Next Story