హైదరాబాద్​ పబ్లిక్ స్కూలులో అడ్మిషన్స్ పొందే ఎస్టీ విద్యార్ధులకు గుడ్ న్యూస్


హైదరాబాద్​ పబ్లిక్ స్కూలులో అడ్మిషన్స్ పొందే ఎస్టీ విద్యార్ధులకు గుడ్ న్యూస్

హైదరాబాద్​ బేగంపేట హైదరాబాద్​ పబ్లిక్​స్కూల్‌తో పాటు రామంతపూర్‌లో అడ్మిషన్స్ పొందే గిరిజన విద్యార్థులకు రెండు హాస్టళ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్‌టీ నెంబర్​53 ప్రకారం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ రెండు చోట్ల ఒక్కోటి చొప్పున బాల బాలికలకు వేరు వేరుగా ఈ హాస్టళ్లు నిర్మిస్తున్నారు. అది కూడా వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఇవి పనిచేస్తాయి. హెచ్​పీఎస్‌లోని హాస్టల్‌కు రూ. 20 లక్షల 30 వేలు, అలాగే రామంతపూర్‌లోని హాస్టల్‌కు రూ.

కోటి 33 లక్షలను గిరిజన సంక్షేమ శాఖ ఖర్చు చేయనుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, విద్యా శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు "ఉగాది పండుగ" కానుక గా కొత్త హాస్టళ్లను మంజూరు చేయడం విశేషం. "విద్యపై పెట్టుబడి, భవిష్యత్తు పెట్టుబడిగా తమ ప్రభుత్వం భావిస్తుందని సీఎం రేవంత్​రెడ్డి తరచూ పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హె​పీఎస్‌లో అడ్మిషన్స్ పొందే గిరిజన బిడ్డల చదువుల కోసం ప్రత్యేకంగా రెండు హాస్టళ్లు మంజూరు కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated On 31 March 2025 10:49 AM IST
Ck News Tv

Ck News Tv

Next Story