హిట్ అండ్ రన్ కేసు.. యువతికి తీవ్ర గాయాలు

హిట్ అండ్ రన్ కేసు.. యువతికి తీవ్ర గాయాలు

హైదరాబాద్లో కారు అతి వేగం కారణంగా ఓ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బాల్నగర్లో కలకలం రేపింది. బాల్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఐడిపిఎల్ చౌరస్తా దగ్గర ఓ యువతిని ఫార్చునర్ కారు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో 19 ఏళ్ల యువతి సాయి కీర్తి తీవ్రంగా గాయపడింది. ఈ రోజు ఉదయం బాలనగర్ ఐడీపీఎల్ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది.

ఫార్చునర్ కారులో అతివేగంగా ప్రయాణిస్తున్న యువకుడు మద్యం మత్తులో ఉండటంతో అదుపుతప్పి రోడ్డుపై నడుస్తున్న సాయి కీర్తిని ఢీకొట్టాడు. అయితే, ఆక్సిడెంట్ చేసిన వెంటనే కారు ఆపకుండా అక్కడి నుంచి పరుగుతీశాడు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు నేరుగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని ఫతేనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.

అతడిని బల్కంపేట్‌కు చెందిన గొగం అనిల్‌గా గుర్తించారు. దర్యాప్తులో అనిల్ తన స్నేహితులతో కలిసి మొయినాబాద్‌లోని ఓ ఫాం హౌస్‌లో పార్టీ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పార్టీ అనంతరం మద్యం మత్తులోనే కారును నడిపాడు. అతివేగం, మద్యం మత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయి కీర్తిని అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Ck News Tv

Ck News Tv

Next Story