అసెంబ్లీలో కేటీఆర్ Vs భట్టి.. సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

అసెంబ్లీలో కేటీఆర్ Vs భట్టి.. సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

అసెంబ్లీలో కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఏం పనులు కావాలన్నా 30 శాతం కమీషన్లు కాంగ్రెస్ నేతలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది.

కమీషన్లు తీసుకోనిదే పనులు చేయడం లేదని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రాజేశాయి.

కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు.మేము అడుగుతాం.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వలేదని అంటాం.. ఇక, 30 శాతం కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఇక, కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. నీలాగా విలువలు లేని రాజకీయాలు చేయడం లేదు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ మండిపడ్డారు.

దోచుకున్నది నువ్వు.. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది మీరు.. మాపై నిందలు వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 శాతం కమిషన్ అని అడ్డగోలుగా మాట్లాడితే ఎలా. కేటీఆర్ తక్షణమే క్షమపణ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

అయితే, టెనెంట్ యాక్ట్ తో లక్షల మందికి భూమిపై హక్కు వచ్చింది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చిన అనేక ఉద్యమాల్లో ఆక్యుపేషన్ కాలం వచ్చింది.. ఉద్యమాలతో వచ్చిన చట్టాలు చూశాం కానీ.. ఆ చట్టాలు ఒక్క కలం పోటుతో వెనక్కి పోయేలా చేసింది బీఆర్ఎస్.. దుర్మార్గమైన చట్టం ధరణి మార్చాలని మేం కోట్లాడాం..

ధరణినీ బంగాళా ఖాతంలో వేస్తామన్నాం.. వేశాం.. గత ప్రభుత్వం పేదల హక్కులు కాల రాసి.. ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి మా తాత పేరు మీద భూమి ఉంది.. ఇది మాది అని లాక్కున్నారు..

ధరణి అంత దుర్మార్గం ఇంకా కొనసాగిస్తామంటే ఎట్లా అని ప్రశ్నించారు. ప్రజలు ధరణి ఎత్తేయాలని ఓటేశారు మాకు.. తెలంగాణ రాచరికం సమయంలో వెట్టిచాకిరి ఎక్కువైంది.. వెట్టిచాకిరి నుండి సాయుధ పోరాటం.. దాంతోనే అనుభవదారు కాలం వచ్చిందని చెప్పారు.

ఇందిరా గాంధీ కాలంలో చట్టాలు మార్చారు.. ఆ తర్వాత జమీందారులు భూమి ఎక్కువ తమ చేతుల్లో పెట్టుకున్నారు.. అందుకే నక్సల్ బరి వచ్చింది.. ప్రజలను తప్పుదోవ పట్టించే పనిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు..

ప్రజల సమస్యలపై రెవెన్యూ సదస్సులు పెట్టడం తప్పా అని అడిగారు. ధరణి పేరుతో అడ్డగోలుగా భూములు లాక్కోవడం కరెక్ట్ హా అని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

ఇక, కేటీఆర్ డెమోక్రసీ అంటున్నాడు.. పద్ధతిగా ఉంటాడు అనుకున్నాం.. ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం పద్దతి కాదని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

వాస్తవంగా చర్చ జరగాలి.. సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.. అడ్డగోలుగా యాడ్స్ ఇస్తున్నారు అంటున్నారు.. సివిల్ విద్యార్దులకు లక్ష ఇచ్చాం.. రూ. 40 వేల కోట్ల పనులు చేయించి.. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా పోయారు..

దీనిపై కేటీఆర్ కి సవాల్ చేస్తున్నాను.. దమ్ముంటే ప్రూవ్ చేసుకోవాలి.. లేదంటే క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. ఇక, సభలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. గేట్ నెంబర్ 4 దగ్గర మెట్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.

Ck News Tv

Ck News Tv

Next Story