ఎల్బీనగర్​ ఎమ్మెల్యే వర్సెస్​ మన్సూరాబాద్​ కార్పొరేటర్​

ప్రొటోకాల్ రగడ.. ఎల్బీనగర్​ ఎమ్మెల్యే వర్సెస్​ మన్సూరాబాద్​ కార్పొరేటర్​


బీఆర్ ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ప్రోటోకాల్ రగడ తలెత్తింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మన్సూరాబాద్​డివిజన్​కార్పొరేటర్​, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ ​లీడర్​కొప్పుల నర్సింహ్మారెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ మొదలైంది.

ఈ నెల 12 న మన్సూరాబాద్ డివిజన్ లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి తమకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే కొబ్బరి కాయలు కొట్టారని కార్పొరేటర్​కొప్పుల నర్సింహ్మారెడ్డి, బీజేపీ నేతలు ఆరోపించారు.

ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించడం లేదని కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మారెడ్డి గత బుధవారం ప్రెస్​మీట్​పెట్టి ప్రశ్నించారు.

దీంతో ఈ రోజు అదే అభివృద్ధి పనులకు కొప్పుల కొబ్బరికాయ కొట్టారు. 'శంకుస్థాపన పూర్తి అయిన పనులకు మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారు' అని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ డివిజన్​నాయకుడు,

ఎమ్మెల్యే అనుచరుడు జక్కిడి రఘువీరా​రెడ్డి, కార్యకర్తలు కొప్పులను అడ్డుకొని నిరసనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

వెంటనే హయత్​నగర్​సీఐ నాగరాజు గౌడ్​ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్​మెట్​పీఎస్​కు తరలించారు.

అరెస్ట్ చేసే క్రమంలో బీఆర్ఎస్ నాయకులకు పలు గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి అబ్దుల్లాపూర్​మెట్ పీఎస్ కు చేరుకున్నారు.

సీఐ అత్యుత్సాహం సరికాదు..

హయత్​నగర్​ సీఐ నాగరాజు గౌడ్​ తీరుపై ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్​ఎస్​ కార్యకర్తలను పేర్లు అడిగి రఘువీర్​, నాగరాజులను బూతులు తిడుతూ కొట్టారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

పోలీసుల అత్యుత్సాహం సరి కాదని హితవు పలికారు. అధికార కాంగ్రెస్​, బీజేపీ ఏకమై సుధీర్​రెడ్డి , సుధీర్​రెడ్డి అనుచరులను ఏమీ చేయలేరని తస్మాత్​ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

Ck News Tv

Ck News Tv

Next Story