చాక్లెట్ దొంగిలించాడని బాలున్ని చితకబాదిన మెగా డీమార్ట్ యాజమాన్యం

చాక్లెట్ దొంగిలించాడని బాలున్ని చితకబాదిన మెగా డీమార్ట్ యాజమాన్యం

చాక్లెట్ దొంగిలించాడన్న కారణంతో సూపర్​మార్కెట్​యాజమాన్యం, సిబ్బంది ఓ బాలున్ని రోజంతా గోడౌన్ బంధించి, చితకబాదారు.

ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మంచాల రోడ్డులోని మెగా డీమార్ట్ లో చోటుచేసుకుంది.

ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తిప్పలమడుగుకు చెందిన ఆరూరి శివ మంచాల మండలం నోముల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.

మంగళవారం ఎవరికీ చెప్పకుండా ఇబ్రహీంపట్నం వచ్చాడు. మధ్యాహ్నం మంచాల రోడ్డులోని మెగా డీమార్ట్ కు వెళ్లాడు.

అక్కడ చాక్లెట్ దొంగిలించడాన్ని గమనించిన మార్ట్ యాజమాన్యం, సిబ్బంది ఆ బాలున్ని, గోడౌన్​లో బంధించి, విచక్షణారహితంగా కొట్టారు. అతని కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వారు సంఘటన స్థలానికి చేరుకొని, శివను దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మార్ట్​యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Ck News Tv

Ck News Tv

Next Story