నిమ్స్ ప్రొఫెసర్ ఆత్మహత్య

నిమ్స్ ప్రొఫెసర్ ఆత్మహత్య

నిమ్స్‌లో ఫ్రొఫెసర్‌గా పనిచేసే వ్యక్తి చెరువులో శవమై కనిపించిన ఘటన మేడ్చల్‌ జిల్లా సూరారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుకానిగూడలో నివాసముంటున్న డాక్టర్‌ ఎం.విజయభాస్కర్‌(62) నిమ్స్‌ బయోకెమిస్ట్రీ విభాగంలో ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 25న వేకువజామున ఎవరికీ చెప్పకుండా తన సెల్‌ఫోన్లను ఇంట్లోపెట్టి బయటికి వెళ్లిపోయారు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో ఆయన భార్య సుజాత సూరారం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గురువారం సూరారం లింగం చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలియాడుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి విజయ్‌భాస్కర్‌ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడే అలవాటు ఉన్న విజయభాస్కర్‌ అప్పులు చేశాడని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Ck News Tv

Ck News Tv

Next Story