✕
ఓఆర్ఆర్‌పై పోలీసు వాహనం బోల్తా..

x
ఓఆర్ఆర్‌పై పోలీసు వాహనం బోల్తా,
నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు,
సంగారెడ్డి - పటాన్‌చెరు వద్ద ఘటన
పోలీసు వాహనం బోల్తా పడటంతో నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు అయిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
సంగారెడ్డి - పటాన్‌చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద టైరు బ్లాస్ట్ కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ చెందిన పోలీసు వాహనం బోల్తాపడింది.వాహనంలో ఉన్న నలుగురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
సైబరాబాద్ కమిషనరేట్ నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. డ్యూటీలో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్తుండగా కారు టైరు బ్లాస్ట్ కావడంతో వాహనం బోల్తా పడింది.
వాహనంలో ఉన్నవారంతా కూడా ఏఆర్ కానిస్టేబుల్స్. తీవ్రగాయాలైన కానిస్టేబుల్స్ ను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.

Ck News Tv
Next Story