స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం

స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం

నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మార్గాల్లో క్రాస్‌ మసాజ్‌ చేస్తున్న స్పా సెంటర్‌పై ఫిలింనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల సమాచారం మేరకు... ఫిలింనగర్‌ రోడ్డు నెంబర్‌-5లో అర్బన్‌ రిట్రీట్‌ పేరుతో మసాజ్‌ పార్లర్‌ నిర్వహిస్తున్నాడు. అయితే వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా క్రాస్‌ మసాజ్‌కు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదు అందుకున్న ఫిలింనగర్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పలువురు యువతులు మసాజ్‌ థెరపిస్టుల పేరుతో క్రాస్‌ మసాజ్‌కు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో స్పా యజమాని అక్షయ్‌ బొహ్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భర్త స్నేహితుడని కారు ఇస్తే...

వెంగళరావునగర్‌: భర్త స్నేహితుడని నమ్మి కారు ఇస్తే దాన్ని సదరు వ్యక్తి తాకట్టు పెట్టిన సంఘటన మధురానగర్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... కె.లక్ష్మి అనే మహిళ కళ్యాణ్‌నగర్‌కాలనీలోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నారు. గత ఏడాది జూన్‌ 10వ తేదీ తన భర్త స్నేహితుడైన పరమేశ్వర్‌రెడ్డి వచ్చి తన కారును తీసుకెళ్లాడు. నాలుగు రోజుల్లో ఇస్తానని చెప్పాడు. అయితే ఎంతకీ కారును తీసుకురాలేదు. ఈ నెల 5వ తేదీనాడు చల్లా మనోహర్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేసి పరమేశ్వర్‌రెడ్డి కారును తనకు మార్ట్‌గేజ్‌ చేశాడని తెలియజేశాడు. దాంతో ఆమె మధురానగర్‌ పీఎస్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Ck News Tv

Ck News Tv

Next Story