వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఉబ్బిన చేయి....


వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఉబ్బిన చేయి....

హైదరాబాద్లో ఓ డయాగ్నస్టిక్ సెంటర్ చేసిన పనికి ఓ మహిళ ప్రాణాలపైకి వచ్చింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళ అయోమయ స్థితిలోకి వెళ్లాల్సి వచ్చింది.

సిబ్బంది చేసిన పనికి తనకు ఏమయ్యిందో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్లింది. కూకట్ పల్లిలోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్ లో జరిగింది ఈ ఘటన.సోమవారం (మార్చి 17) ఉదయం కూకట్ పల్లిలోని డయాగ్నస్టిక్ టెస్టు కోసం ఓ మహిళ వెళ్లింది.

టెస్టు చేసే ముందు ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉండగా.. ఇవ్వాల్సిన చోట కాకుండా మరో చోట ఇవ్వడంతో ప్రమాదకర స్థాయిలో ఇన్ఫెక్షన్ అయ్యింది. దీంతో చేతి మొత్తం ఊబ్బిపోయింది.

రెండు గంటల తర్వాత చేతి మీద మొత్తం బబుల్స్ రావడంతో సిబ్బందిని అడగగా పొందన లేని సమాధానం చెప్పడమే కాకుండా రెండు రోజుల్లో తగ్గిపోతుంది అంటూ దాటవేశారు. సమస్య భయాందోళకు గురిచేస్తుంటే దాట వేస్తున్న సిబ్బందిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకు ఎటువంటి ఇంజక్షన్ ఇచ్చారో చెప్పాలని కోరగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తమని పట్టించుకోలేదంటూ బాధితురాలు ఆమె కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.

దీంతో బాధితులు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూకట్ పల్లి మెడ్ ప్లస్ డయాగ్నస్టిక్ సెంటర్ లో బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్నారని, ఒకరికి ఇవ్వాల్సిన రిపోర్టులు మరొకరికి ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయని వారు చెప్పుకొచ్చారు. ఈ అంశంపై పోలీసులు వివరణ ఇవ్వాల్సిందిగా సూచించారు. పోలీసులు విచారణ ప్రారంభించారు.

Ck News Tv

Ck News Tv

Next Story