రామోజీ ఫిలిం సిటీ వద్ద ఉద్రిక్తత

రామోజీ ఫిలిం సిటీ వద్ద ఉద్రిక్తత

రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం పేదల ఇండ్ల స్థలాల ఆక్రమణపై సిపిఎం పార్టీ చేపట్టిన చలో రామోజీ ఫిలిం సిటీ ముట్టడి కార్యక్రమం రణరంగంగా మారింది

సుమారు వెయ్యి మందితో కలిసి 2 కిలోమీటర్ మేరా పాదయాత్రగా బయలుదేరి రామోజీ ఫిలిం సిటీనీ ముట్టడి చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లి సర్వే నంబర్ 189,203 లలో 2007 సంవత్సరంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో సుమారు 597 మంది పేదలకు 60 గజాల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించింది. వీటికి లబ్ధిదారులకు అప్పటి రెవిన్యూ అధికారులు ప్రొసీడింగ్లు జారీ చేశారు. అప్పటినుండి పేదలకు అందించిన ఇంటి స్థలాలను రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఆక్రమించి పేదలను అటువైపు రాకుండా భారీ ఎత్తులో ప్రహరీ గోడ, గేట్లను నిర్మాణం చేసి సెక్యూరిటీని ఏర్పాటు చేస్తూ వచ్చారు. దీంతో సిపిఎం ఆధ్వర్యంలో రామోజీ ఆధీనంలో ఉన్న ఇంటి స్థలాలను తిరిగి పేదలకు అందించేలా చలో రామోజీ ఫిలిం సిటీ ముట్టడి చేపట్టింది. దీంతో ఇంటి స్థలాల లబ్ధిదారులు, సిపిఎం నాయకులు భారీగా ర్యాలీగా వెళ్లడంతో పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు చేపట్టారు.

లబ్ధిదారుల ఇంటి స్థలాల వద్దకు చేరుకునేందుకు సిపిఎం నాయకులు ప్రయత్నాలు జరిపిన భారీ గేట్లను ఏర్పాటు చేసి ఉండడంతో గేట్ల ముందు ఆందోళన చేపట్టారు. తక్షణం లబ్ధిదారులకు న్యాయం చేపట్టాలని రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి తిరిగి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆందోళన చేపట్టారు. కొద్దిసేపు పోలీసులకు సిపిఎం నాయకులు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురు నాయకులు గేట్ల పైకి ఎక్కి ఇంటి స్థలాల వైపు దూసుకెళ్లారు. పోలీసులు ఆందోళనకారులను నిలువరించేందుకు ప్రయత్నాలు జరిపారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు తోపులాట చోటు చేసుకుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తో పాటు పలువురి ముఖ్య నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.


అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాలను ఇవ్వకుండా ఆక్రమణకు గురి చేసిందని దీనిపై పలుమార్లు సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకునే నాధుడే కరువయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వం రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యానికి కొమ్ము కాస్తుందని పేదలకు అందించిన ఇంటి స్థలాలను తిరిగి ఇవ్వకుండా ఇలా పోలీసు నిర్బంధాలతో ఉద్యమాన్ని అనుచాలని చూస్తుంద ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు నిర్బంధాలు సిపిఎం నాయకులకు కొత్తవి కావని అన్నారు. ఇలా అమానుషంగా పోలీస్ లను మోహరించి ఉద్యమాన్ని ఆపాలని చూస్తే సహించేది లేదని లబ్ధిదారులకు తిరిగి ఇంటి స్థలాలు కేటాయించే అంత వరకు తాము ఉద్యమాన్ని ఆపలేమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్, జగదీష్, కందుకూర్ జగన్, మండల కార్యదర్శి బుగ్గరాములు, జిల్లా నాయకులు జంగయ్య, కిషన్, నరసింహ, నర్సిరెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యదర్శి ఎలేష, నాయకులు వెంకటేష్, తులసిగారి నరసింహ, ఆనంద్, ప్రకాష్ కారత్,అరుణ స్వప్న, యాదగిరి, చరణ్, శ్రీకాంత్, శివ తదితరులు ఉన్నారు.

Ck News Tv

Ck News Tv

Next Story