ప్రీన్సిపాల్ తిట్టాడని.. స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకిన టెన్త్ విద్యార్థి
ప్రిన్సిపాల్ తిట్టాడని.. స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకిన టెన్త్ విద్యార్థి
పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని శాస్త్ర స్కూల్‌లో జరిగింది. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నీరజ్(15) సాయంత్రం 4.30 గంటల సమయంలో తోటి విద్యార్థులతో కలిసి మొదటి అంతస్తులో మాట్లాడుకుంటూ నిలబడ్డారు. అతడితో పాటు ఉన్న విద్యార్థులు వాష్ రూంకు వెళ్లగా అక్కడికి కుర్చీ తెచ్చుకుని సుమారు 6 ఫీట్ల రేలింగ్ గోడపై నుంచి కిందికి దూకాడు. కింద ఉన్న మిగతా విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు చెప్పారు.
వెంటనే అతడిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా అప్పటికే నీరజ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఉపాధ్యాయులు వేధింపుల వల్లే విద్యార్థి మృతి చెందాడని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్‌ను తమ వెంట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.