బాలికలపై చెంప దెబ్బలతో, బూతు మాటలతో రెచ్చిపోయిన ప్రిన్సిపాల్...
బాలికలపై చెంప దెబ్బలతో, బూతు మాటలతో రెచ్చిపోయిన ప్రిన్సిపాల్...

బాలికలపై చెంప దెబ్బలతో, బూతు మాటలతో రెచ్చిపోయిన ప్రిన్సిపాల్...
వికారాబాద్‌లోని కొత్త గడీ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాల మరోసారి వార్తల్లోకెక్కింది.
గత నెలలో ఈ బడి పై నుంచి ఓ బాలిక దూకిన ఘటనను మరువక ముందే.. తాజాగా పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థినులను బూతులు తిడుతూ కొట్టిన వీడియో వైరల్‌గా మారింది.
తాము వెళ్లడం తప్పేనంటూ విద్యార్థినులు చెప్పే ప్రయత్నం చేస్తుండగా.. 'మీకు నోరెట్ల వస్తది..' అంటూ చేయి చేసుకున్నారు.
ఓ విద్యార్థినిని పలుమార్లు చెంప దెబ్బలు కొట్టిన ప్రిన్సిపాల్.. ఆ బాలికపై నోరు పారేసుకున్నారు. విద్యార్థినులపై చేయి చేసు కోవడమే కాకుండా వారి తల్లిదండ్రులను కూడా తిట్టారు.
కాగా, ప్రిన్సిపాల్ ఇలా చేయడం కొత్తేమీ కాదని విద్యార్థినులు చెబుతున్నారు. బడిలో టీచర్లు తమపై ఇష్టానుసారం చేయిచేసుకుంటున్నా..
బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని వాపోతున్నారు. తమను దండించేందుకు ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా కర్రలు తెప్పించారని చెబుతున్నారు.
ప్రిన్సిపాల్, కొందరు ఉపాధ్యాయుల తీరు వల్ల పాఠశాలలో ఉండాలంటేనే విద్యార్థినులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత నెలలో ఈ పాఠశాల భవనం పై నుంచి ఓ విద్యార్థిని కిందకు దూకింది.
ఆ ఘటన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్.. ప్రిన్సిపాల్‌ను మందలించారు. అయినా ప్రిన్సిపాల్, సిబ్బంది తీరు మారలేదు.
