ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఈ యువతి ఆత్మహత్య

ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఈ యువతి ఆత్మహత్య

ఓ వివాహిత హైదరాబాద్ నడ్డి రోడ్డుపై ఆత్మహత్య చేసుకున్నది. హైదరాబాద్ సిటీలో ఇటీవలే కొత్తగా ఓపెన్ అయిన పాతబస్తీలోని దబీర్ పూర్ ఫ్లై ఓవర్ పై నుంచి దూకింది.

50 అడుగుల ఎత్తు నుంచి కింద రోడ్డుపైకి దూకటంతో స్పాట్ లోనే చనిపోయింది ఆ వివాహిత. ఆమె పేరు తాహనజర్ అని గుర్తించారు పోలీసులు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో మంగళవారం ( మార్చి 25 ) తెల్లవారుజామున ఘోరం జరిగింది.. నగరవాసులంతా అప్పుడప్పుడే నిద్రలేస్తున్న సమయంలో.. పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో ఓ వివాహిత ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది ఈ ఘటన..స్థానిక దబీర్ పూర ఫ్లైఓవర్ పైనుంచి దూకి తాహనజర్ అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం ( మార్చి 25 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

స్థానికులు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతికి కుటుంబ కలహాలేమైన కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Ck News Tv

Ck News Tv

Next Story