'చెయ్.. నువ్వేం చేస్తవో నేనూ చూస్తా'.. కేటీఆర్‌పై అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్
'చెయ్.. నువ్వేం చేస్తవో నేనూ చూస్తా'.. కేటీఆర్‌పై అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్

'చెయ్.. నువ్వేం చేస్తవో నేనూ చూస్తా'.. కేటీఆర్‌పై అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఎమ్ఐఎమ్ నేత, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సోమవారం ఆయన అసెంబ్లీలో మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేంటో ఎమ్ఐఎమ్‌కు చూపిస్తామని కేటీఆర్‌కు చేసిన కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ఏం చేస్తుందో, చేయగలుగుతుందో మేమూ చూస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేతలే చెబుతున్నారని అక్బరుద్దీన్ చెప్పుకొచ్చారు.
కాగా, అంతకుముందు శాసనసభ లో ప్రభుత్వంపైనా అక్బరుద్దీన్ ఫైర్ అయ్యారు. సభను నడుపుతున్న తీరును నిరసిస్తూ ఆ పార్టీ సభ్యులు బయటకు వచ్చారు.
శాసనసభను నడపటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? అని మండిపడ్డారు.
ఇది గాంధీభవన్ కాదని.. తెలంగాణ శాసనసభ అనే సంగతి కాంగ్రెస్ నేతలు గుర్తుపెట్టుకోవాలని అక్బరుద్దీన్ సూచించారు.
