
చికోటి ప్రవీణ్ అరెస్ట్.. 14 మంది మహిళలు కూడా..
థాయిలాండ్‌లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా అరెస్ట్ అయ్యింది. థాయిలాండ్‌లోని పటాయలో 90 మంది భారతీయులను అరెస్ట్ చేశారు.
భారీగా నగదు, గేమింగ్ చిప్స్ స్వాధీనం చేసుకున్నారు. 20.92 కోట్ల విలువైన గేమింగ్ చిప్స్.. 1.60 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు.
చీకొటి ప్రవీణ్ నేతృత్వంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. చీకొటి ప్రవీణ్, మాధవరెడ్డిని అక్కడి పటాయా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.