తాగిన మైకంలో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం..

తాగిన మైకంలో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం..

తాగిన మైకంలో ఏ ఆర్ కానిస్టేబుల్ ఒకరు వీరంగం సృష్టించాడు. తల్లిదండ్రులతో గొడవ పడుతూ, ఇంట్లో ఉన్న వస్తువులను పగలగొడుతుండగా, అదే సమయంలో స్కూల్ నుంచి వచ్చిన మరదలు వీడియో రికార్డింగ్ చేస్తుండగా,

ఈ గొడవ కంతటికీ కారణం నువ్వేనంటూ మరదలు పై కర్రతో దాడి చేయడమే కాకుండా, సెల్ ఫోన్ గుంజుకొని బండకు కొట్టి, సినిమా స్టైల్ లో ఫైటింగ్ జరిగిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

ఆస్తి పంపకాల విషయంలో ఏ ఆర్ కానిస్టేబుల్ సంతోష్, సోదరుడు వేణుతో తరచూ గొడవ జరిగేది. తాగిన మైకంలో ఉన్న సంతోష్, తల్లిదండ్రులతో ఆస్తి పంపకాల విషయమై గొడవ పడుతూ, ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేశాడు.

అదే సమయంలో ఇంటికి చేరుకున్న మరదలు, బావ చేస్తున్న వీరంగాన్ని తన సెల్ ఫోన్ లో రికార్డు చేస్తుండగా, ఈ విషయాన్ని గమనించిన ఆయన, కోపంతో విర్రవీగుతూ తన వద్ద ఉన్న కట్టే తో దాడి చేశాడు.

అంతటితో ఊరుకోకుండా రికార్డింగ్ చేస్తున్న సెల్ ఫోన్, ఆమె చేతుల నుంచి గుంజుకొని బండ కొట్టాడు. అప్పటికే రోడ్డుపై జనం గుమిగూడి ఉండడం, అదే సమయంలో సోదరుడు వేణు తన స్నేహితులతో కలిసి కారులో వచ్చాడు.

తన భార్యను కొట్టడంతో ఆగ్రహించిన వేణు, అన్న పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వేణు స్నేహితులు కానిస్టేబుల్ సంతోష్ ను నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన కారు అద్దాలు ధ్వంసం చేశాడు.

దీంతో అన్నదమ్ములు గల్లాలు పట్టుకొని కొట్టుకుంటుండగా జరిగిన పెనుగులాటలో సంతోష్ కింద పడిపోవడంతో తలకు దెబ్బ తగిలినట్లు తెలుస్తుంది.

బావ మరదల్లు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరస్పర ఫిర్యాదులు చేసుకోగా, బావ చేతిలో గాయపడ్డ మరదలు ను ఎస్ఐ డి ఆంజనేయులు మెడికల్ పంపించారు. సుమారు గంట పాటు సినిమా స్టైల్ లో ఫైటింగ్ జరిగినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.

కానిస్టేబుల్ సంతోష్ పై కేసు నమోదు..

అక్రమంగా ఇంట్లో ప్రవేశించడమే కాకుండా, అసభ్యంగా ప్రవర్తిస్తూ, తన మరదలు పై దాడి చేసిన కానిస్టేబుల్ సంతోష్ పై కేసు నమోదు చేసినట్లు భిక్కనూరు ఎస్ఐ డి ఆంజనేయులు బుధవారం రాత్రి "మీడియా"తో మాట్లాడుతూ తెలియజేశారు.

Updated On 13 March 2025 10:42 AM
Ck News Tv

Ck News Tv

Next Story