భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం

కామారెడ్డిలో దారుణం: భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం
కామారెడ్డి పట్టణంలో శనివారం నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త, ఆ తరువాత అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.
పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం నిజాంసాగర్ చౌరస్తాలో అందరు చూస్తుండగా ఆర్ బి నగర్ కు చెందిన నర్సింలు ( 60 ) అనే వ్యక్తి తన భార్య మహేశ్వరినీ ( 48 ) కత్తితో పొడిచి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద కత్తితో పొడిచి చంపిన సంఘటన చోటుచేసుకుంది.
భార్యాభర్తల మధ్య గొడవతో భర్త నర్సింలు భార్య మహేశ్వరినీ అతి దారుణంగా కత్తితో పొడిచి భర్త నర్సింలు సైతం పోడుచుకున్నాడు.
దీంతో భార్య మహేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా భర్త కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.
విషయం తెలుసుకున్న ఏఎస్పి చైతన్య రెడ్డి, సిఐ చంద్రశేఖర్ రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి, స్థానికులు మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం అందాదా ఒంటిగంట 50 నిమిషాల మధ్యాహ్నం ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు గొడవపడి భర్త నర్సింలు భార్య మహేశ్వరిని కత్తితో దాడి చేయడం జరిగిందని,
భార్య అక్కడికక్కడే మృతి చెందిందని, అదే కత్తితో భర్త నర్సింలు కూడా కత్తితో పొడుచుకోవడం జరిగిందని తెలిపారు. వారిద్దరికీ పిల్లలు కూడా లేరనీ అన్నారు.
వారు ఆర్బి నగర్ కాలనీలో ఉంటున్నారని తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది తెలిపారు.
