KTR కరీంనగర్ సభలో 'బుల్లెట్' కలకలం

KTR కరీంనగర్ సభలో 'బుల్లెట్' కలకలం

కరీంనగర్‌లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ సభలో అపశృతి చోటు చేసుకుంది. సభ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ నేతలు ర్యాలీ నిర్వహించారు.

ఆ ర్యాలీలో కరీంనగర్‌లోని కోతి రాంపూర్‌కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు బుల్లెట్‌తో ర్యాలీలో బీభత్సం సృష్టించాడు.


బుల్లెట్ బైకును రేస్ చేస్తూ జనం పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పద్మజా అనే కానిస్టేబుల్‌పై ఎక్కించాడు. దీంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడటంతో పాటు ఆమె కాలు విరిగింది.

దీంతో అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది శ్రీకాంత్‌ను పట్టుకుని బుల్లెట్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ కానిస్టేబుల్ పద్మజను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Updated On 23 March 2025 4:40 PM IST
Ck News Tv

Ck News Tv

Next Story