పదో తరగతి విద్యార్థులను చితకబాదిన సీనియర్లు



పదో తరగతి విద్యార్థులను చితకబాదిన సీనియర్లు


కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలోని రుక్మాపూర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో గురువారం రాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది.

పదోతరగతి విద్యార్థులపై ఇంటర్మీడియట్‌ విద్యార్థులు దాడి చేసి గాయపరిచారు. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి కొంతమంది ఇంటర్‌ విద్యార్థులు నలుగురు పదో తరగతి విద్యార్థులపై దాడి చేసి గాయపరిచారు. కర్రలతో దాడి చేయడంతో పదో తరగతి విద్యార్థుల కాళ్లకు, వీపుపై గాయాలు అయ్యాయి. ఒక విద్యార్థి కంటికి గాయం అయ్యింది. దీంతో పదో తరగతి విద్యార్థులు రాత్రి డ్యూటీలో ఉన్న ఇన్‌స్ట్రక్టర్లకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు చేసినందుకు మరోసారి దాడి చేయడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు గాయపడ్డ విద్యార్థులను రాత్రి కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. గాయపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాలకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. దాడికి పాల్పడ్డ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్‌ తెలిపారు. అనంతరం తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. దాడులకు పాల్పడవద్దని, భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఎస్‌ఐ అనూష విద్యార్థులకు కౌన్సెలింగ్‌ చేశారు

Ck News Tv

Ck News Tv

Next Story