* లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి

*చిన్న, సన్న కారు రైతుల వ్యవసాయ యాంత్రీకరణ ప్రోత్సాహకానికి కేంద్రం ఏం చర్యలు చేపడుతోంది..?*

* పూర్తిస్థాయి అమలుకు ప్రత్యేక విధానం అవలంబిస్తారా..?

* లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి

*ఖమ్మం:* రెండు హెక్టార్ల లోపు సాగు భూమి ఉన్న చిన్న, సన్న కారు రైతుల వ్యవసాయ యాంత్రీకరణ ప్రోత్సాహకానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రస్తుత స్థాయి వివరాలను కోరారు. దీనికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

*కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలిపిన వివరాలు ఇలా..*

* చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ సాగుకు సంబంధించి.. యాంత్రీకరణ ప్రోత్సాహకానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది. వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ(డీఏ& ఎఫ్ డబ్ల్యూ), కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రీకరణ కోసం ఎస్ ఎంఏఎం సబ్ మిషన్ ద్వారా.. యంత్రాల కొనుగోలుకు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాం.

* యంత్రాలు, పరికరాలను అందించేందుకు కస్టమ్ హైరింగ్ సెంటర్ ( సీహెచ్ సీ)ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలిస్తున్నాం.

*

గ్రామస్థాయి వ్యవసాయ యంత్రాల బ్యాంక్ (ఎఫ్ఎంబీ) స్థాపనకు రూ.2.50 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో 40% గ్రామీణ పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పిస్తున్నాం. గ్రామస్థాయి వ్యవసాయ యంత్రాల బ్యాంకు ప్రాజెక్టు వ్యయంలో 80% అనగా రూ.30 లక్షలు అందిస్తాం.

* యాంత్రీకరణ ప్రోత్సాహానికి 2025 నాటికి రూ. 8,110.24 కోట్లను వివిధ రాష్ట్రాలకు కేటాయించాం. 52,000లకు పైగా సీహెచ్ సీ, హైటెక్ హబ్, ఎఫ్ఎంబీ లు స్థాపించబడ్డాయి. 41,900కు పైగా కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. సీ ఆర్ఎం పథకం కింద 2018- 19 నుంచి 2025 ఫిబ్రవరి నాటికి రూ. 3,607 కోట్లు విడుదలయ్యాయి.

* బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ద్వారా నాణ్యత, భద్రతను ప్రోత్సహించేందుకు 296 భారతీయ ప్రమాణాలను ఆచరిస్తున్నట్లు వివరించారు.

Updated On 26 March 2025 4:08 PM IST
Ck News Tv

Ck News Tv

Next Story