అప్పు కట్టలేదని గొర్రెలు లాక్కెలేన బ్యాంక్ అధికారులు
అప్పు కట్టలేదని గొర్రెలు లాక్కెలేన బ్యాంక్ అధికారులు

అప్పు కట్టలేదని గొర్రెలు లాక్కెళ్లారు
• డీసీసీబీ మేనేజర్ నిర్వాకం
• కొంత సమయం ఇవ్వాలని బతిమాలినా వినని వైనం
రూ.10వేలు కట్టడంతో మళ్లీ ఆటోలో తీసుకొచ్చి వదిలి వెళ్లిన సిబ్బంది
• గోరిలపాడు తండాలో ఘటన
అప్పు కట్టలేదని గొర్రెలు తీసుకెళ్లారు
• డీసీసీబీ అధికారుల నిర్వాకం
కూసుమంచి డీసీసీబీ బ్యాంకు అధికారులు ఒక చిరు రుణగ్రహిత పై ప్రతాపం చూపించారు. కూసుమంచి మండలం గోరిలపాడు తండా కు చెందిన నిరుద్యోగి ధరావత్ లింగ అనే యువకుడు కూసుమంచి డీసీసీబీ బ్యాం కులో రూ.50 వేలు ముద్ర లోన్ తీసుకొని మైక్రో ఫైనాన్స్ ద్వారా గ్రామంలో వృద్ధుల కు, దివ్యాంగులకు పింఛన్లు ఇస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఆరు నెలల నుంచి ఇంట్లో పెద్దలకు పలు ఆరోగ్య అవసరాల నిమిత్తం ఖర్చులు కాగా, ఆరు నెలలుగా ఈఎంఐలు చెల్లించడం లేదు. కాగా సోమవారం కూసు మంచి డీసీసీబీ బ్యాంకు మేనేజర్ తమ సిబ్బందితో ఇంటి వద్దకు వెళ్లి ఈఎంఐ డబ్బులు కట్టలేదని మూడు గొర్రెలను తమ సిబ్బందితో కలిసి ఆటోలో తీసుకెళ్లారు. బాధితుడు తనకు కొంత సమయం ఇవ్వాల ని బతిమాలిన వినకుండా గొర్రెలను తర లించడంతో బాధితుడు రూ.10వేలు కట్ట డంతో గట్టుచప్పుడు కాకుండా గొర్రెల ను బాధితుడు ఇంటికి తరలించారు. వరు సగా ఉగాది, రంజాన్ సెలవులు కావడంతో విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. లక్షలకు లక్షలు లోన్లు తీసుకోని ఎగవేత వేసిన వారిపై ఎటు వంటి చర్యలు తీసుకోని బ్యాంకులు ఇలా చిరు నిరుద్యోగ యువకుడిపై దౌర్జన్యంగా గొర్రెలను తీసు కెళ్లి, మళ్లీ అప్పగించడంతో మండల వ్యా ప్తంగా చర్చనీయాంశంగా మారింది.
