జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్
![బి.ఆర్.ఎస్ ను బీసీ సమాజం క్షమించదు బి.ఆర్.ఎస్ ను బీసీ సమాజం క్షమించదు](https://cknewstv.in/h-upload/2025/02/06/1974300-img-20250206-wa0057.webp)
*బి.ఆర్.ఎస్ ను బీసీ సమాజం క్షమించదు*bre
-- *జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్*
---గడిచిన 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలన లో బీసీలను అణిచివేసిన విధానాన్ని బీసీ సమాజం మరిచిపోదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్ అన్నారు. గురువారం నాడు స్థానిక సత్తుపల్లి లోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి నారాయణవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇటీవలన కాంగ్రెస్ పార్టీ కులగణన ను అసెంబ్లీలో ఆమోదించటంతో యావత్ తెలంగాణ బీసీ ప్రజానీకం సంతోషంగా ఉందని దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కులాలవారీగా జనాభా లెక్కలను తీయటం సంతోషకరమని ఆయన అన్నారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పటం శుభ పరిణామం అని ఆర్థికంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలు వెనుకబడి ఉన్నారని ,ఈ సమాజంలో వారు కూడా ఆత్మగౌరవంతో జీవించాలని మొట్టమొదటిసారిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీలకు రిజర్వేషన్లను తీసుకువచ్చారని ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల రిజర్వేషన్లను 34 శాతానికి పెంచిందని వారు తెలిపారు. కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను అణిచివేసే కుట్రలో భాగంగా 34 శాతం ఉన్న రిజర్వేషన్లు 21 శాతాన్ని తగ్గించిన దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన మండిపడ్డారు. ఈనాడు బలహీన వర్గాల ఉన్నత కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ బిజెపిలు మాత్రం దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయని,
ఎన్నడు బీసీల గురించి మాట్లాడినటువంటి కల్వకుంట్ల కవిత కూడా బీసీల ఆర్థిక స్థితిగతులపై ఆర్టికల్స్ రాయటం హాస్యాస్పదమని శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ బీసీ సమాజం చాలా చైతన్యం కలిగిన వారిని గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం బీసీలను అణచివేసిన విధానాన్ని మర్చిపోరని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ అందిస్తానన్నందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజలా రాణి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దూదిపాల రాంబాబు, కంటే నాగలక్ష్మి,కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి టౌన్ అధ్యక్షులు గాదె చెన్నారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్లగుల్ల నరసింహారావు, సీనియర్ బీసీ సంఘ నాయకులు వినుకొండ కృష్ణ, సుబ్బారావు, రజక సంఘం సత్తుపల్లి టౌన్ అధ్యక్షులు వీరివాడ నాగభూషణం ఎన్ ఐ ఎస్ యు విద్యార్థి సంఘం నియోజకవర్గ అధ్యక్షులు అరవపల్లి సందీప్, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గణేష్, మానుకోట ప్రసాద్, దుస్తా వెంకటేశ్వర్లు, పాపారావులతో పాటు గా పెద్ద సంఖ్యలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
![Admin Admin](/images/authorplaceholder.jpg?type=1&v=2)