ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్ పై కత్తితో దాడి...

ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్ పై కత్తితో దాడి...

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బస్టాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసాడు ఓ అంతర్ రాష్ట్ర దొంగ.

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బస్టాండ్‌లో అనుమానాస్పదంగా కనిపించాడు ఓ దొంగ. కానిస్టేబుల్‌ను చూసి పరారవడంతో.. దొంగను వెంబడిస్తూ వెళ్లారు కానిస్టేబుల్ నరేష్‌.

సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో ఐడి పార్టీ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నరేష్ విధి నిర్వహణలో భాగంగా బస్టాండ్ లో ఉన్నారు.

ఈ క్రమంలో ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చింతాపూర్ గ్రామానికి చెందిన తిరువీధుల సురేందర్ (25) అనుమానస్పదంగా తిరుగుతున్నాడు.

అయితే ఆ యువకుడిని దొంగగా గుర్తించిన కానిస్టేబుల్ పట్టుకోడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్ పై కత్తితో దాడి చేసి నిందితుడు పరారయ్యాడు.

కానిస్టేబుల్ నరేష్ ను గుర్తించిన స్థానికులు సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ కు నాలుగు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి.

స్థానిక పోలీసులు కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సంఘటనపై పట్టణ సి ఐ.టీ కిరణ్, సత్తుపల్లి ఎస్సై ఏ రఘు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బీజేపీ

Ck News Tv

Ck News Tv

Next Story