✕
గుండెపోటుతో డిప్యూటీ సీఎం పీఏ మృతి...

x
ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకులు శ్రీనివాస్ గుండెపోటుతో కొద్దిసేపటి క్రితం మృతి..
ఐసీడీఎస్ లో సూపరింటెండెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్..
గత ఆరు సంవత్సరాలుగా భట్టి విక్రమార్క కు పీఏగా పనిచేస్తున్న శ్రీనివాస్
భట్టి పీఏ మృతికి మంత్రి పొంగులేటి సంతాపం
ఖమ్మం : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందడం పట్ల తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్ధించారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Ck News Tv
Next Story