ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

20 మందికి రూ. 5.25 లక్షల మేరకు లబ్ది

ఖమ్మం: ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో అత్యవసర వైద్య చికిత్స పొందిన పేదలకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సిఫారసుతో ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ఎఫ్) చెక్కులు మంజూరయ్యాయి.

ఈ మేరకు బుధవారం నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో వైరా, మధిర నియోజకవర్గాలకు చెందిన 20 మందికి చెక్కులను కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, నాయకులు అందజేశారు. రూ. 5.25 లక్షల మేరకు లబ్ధి చేకూరింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎంపీ గారు ప్రత్యేక చొరవతో వేగంగా చెక్కులు మంజూరు చేయిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సర్కార్ అని అన్నారు.

*ఈ కార్యక్రమంలో..:* టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ భాయ్, ఓబీసీ కార్పొరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హారికా నాయుడు, నాయకులు స్ఫూర్తి ఓం రాధాకృష్ణ, కన్నెబోయిన సీతారామయ్య, ఖమ్మం పాటి రమేష్, కృష్ణారెడ్డి, ఒంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, ఉత్తేజ్ నాయక్, తాళ్లూరి రాము, తిరుమలి రెడ్డి, చింతమల్ల గురుమూర్తి, ఎయిర్టెల్ నరసింహారావు, జింగిపల్లి ప్రసాద్, మొగిలిచర్ల సైదులు, మందడపు నాగేశ్వరరావు, భాగం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Ck News Tv

Ck News Tv

Next Story