✕
నెలవారీ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కలెక్టరేట్ లోని ఈవీఎం గోడౌన్ ను గురువారం తనిఖీ చేసారు.
x
ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం, ఫిబ్రవరి -06:
నెలవారీ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కలెక్టరేట్ లోని ఈవీఎం గోడౌన్ ను గురువారం తనిఖీ చేసారు.
ఈ సందర్భంగా గ్రౌండ్ ఫ్లోర్ లో బ్యాలెట్, కంట్రోల్ యూనిట్ లు భద్రపరిచిన గది, మొదటి అంతస్తులో భద్రపరిచిన వి.వి. ప్యాట్ గది సీల్ లను, గోడౌన్ వద్ద బందోబస్తును పరిశీలించారు. భద్రతా సిబ్బందితో మాట్లాడుతూ, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు.
జిల్లా కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకులు స్వామి, కలెక్టరేట్ ఎన్నికల డిటి అన్సారీ, అధికారులు, తదితరులు ఉన్నారు.
Admin
Next Story