రీ పోస్టుమార్టం చేసి సమగ్ర విచారణ జరిపించి మాకు న్యాయం చేయండి .

*రీ పోస్టుమార్టం చేసి సమగ్ర విచారణ జరిపించి మాకు న్యాయం చేయండి .*

*ధర్నా చౌక్ లో బాధితుల ఆందోళన*

*సి కె న్యూస్ ప్రతినిధి ఖమ్మం*

ఖమ్మం కొత్త కలెక్టరేట్ సమీపంలో ఉన్న ధర్నా చౌక్ నందు ముదిగొండ మండలం ముత్తారానికి చెందిన గొల్లమూడి కేశవ (22) డిసెంబరు 25న రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడని , ఎవరో చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు సోదరి స్వప్న మరియు కుటుంబ సభ్యులు కొంతమంది గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు . సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్ కార్యాలయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కి వినతిపత్రం అందించారు . అదే గ్రామానికి చెందిన లంజపల్లి హారిక అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది వారిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారని , క్రిస్మస్ పండగ రోజున ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోబోతున్నారు అని అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసి పథకం ప్రకారం ఈ హత్య చేయించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు . సుమారు అర్ధరాత్రి 12 , ఒంటి గంట మధ్యలో కరెంటు గంటసేపు పోయినది ఆ సమయంలోనే గోళ్ళమూడి కేశవుని హత్య చేసి మా ఇంట్లోని ఉరి వేసి చనిపోయినట్లుగా చిత్రీకరించినారు . అట్టి విషయాన్ని ముదిగొండ సీఐ కు తెలియజేస్తే కేసు గురించి ఇంతవరకు నేరస్తులని పిలిపీయకుండా , విచారం చేయకుండా మేము ముదిగొండ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఆ కేసు మర్చిపోండి ఆ కేసు గురించి రాకండి అని అన్నారని పేర్కొన్నారు . దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినా మాకు న్యాయం జరగలేదని , మృతిపై జిల్లా అధికారాలు విచారణ జరపాలని కుటుంబ సభ్యులు భారతమ్మ , నాగయ్య , కుమారి , భద్రమ్మ , సునీత , నవీన్ కొంతమంది గ్రామస్తులు కోరారు .

Ck News Tv

Ck News Tv

Next Story