రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఫారెస్ట్ అధికారులు
రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఫారెస్ట్ అధికారులు

రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఫారెస్ట్ అధికారులు
ఇల్లెందు: మట్టిని తోలుకోవడానికి లంచం కోసం కక్కుర్తిపడిన ఇద్దరు అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెంలో మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.ఇల్లెందు మండలం కొమరారం అటవీశాఖ రేంజ్ అధికారి ఉదయ్ కిరణ్, బీట్ ఆఫీసర్ హిరాలాల్ రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రహదారి నిమిత్తం అటవీ భూమి నుంచి మట్టిని తోలుకునేందుకు గుత్తేదారు నుంచి రు.30 వేలు డిమాండ్ చేశారు. ఇంతకుముందే రూ.20వేలు లంచంగా ఇచ్చినట్లు సమాచారం. మళ్లీ గ్రావెల్ తీస్తుండగా అటు విశాఖ సిబ్బందిని పంపించి జేసీబీని, ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. జేసీబీ, ట్రాక్టర్ ను విడిచి పెట్టేందుకు రూ.15000 లంచం తీసుకున్నట్లుగా సమాచారం. అయినప్పటికీ మళ్లీ గ్రావెల్ తోలుకునేందుకు రూ.50 వేలు డిమాండ్ చేయగా రూ.30,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో గుత్తేదారు ఏసీబీని ఆశ్రయించడంతో మంగళవారం ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
