రంజాన్ పర్వదినాన మాజీ మంత్రికి చేదు అనుభవం...
రంజాన్ పర్వదినాన మాజీ మంత్రికి చేదు అనుభవం...

రంజాన్ పర్వదినాన మాజీ మంత్రికి చేదు అనుభవం...
రంజాన్ పర్వదిన సందర్భంగా ఖమ్మం నగరంలోని ఈద్గా మైదానంలో జరిగిన ప్రార్థన జరిగే కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి అవమానం ఎదురైంది.
రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు ముందుగా వచ్చిన మాజీ మంత్రి అజయ్ కుమార్ ఈద్గా మైదానంలో కూర్చున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సంబంధించిన మైనార్టీ నాయకుడు ఒకరు ఈద్గాలోకి నాన్ ముస్లింలు ఎవరు రాకూడదని నిర్ణయం చేసుకున్నామని వారి కోసం సపరేట్‌గా వేరే వేదిక ఏర్పాటు చేసినట్లుగా మైక్‌లో నుంచి ప్రకటన జారీ చేశారు.
మాజీ మంత్రి పువ్వాడ వ్యతిరేక వర్గీయులుగా ఉన్నవారు ఈ ప్రకటన జారీ చేశారు. దీంతో అక్కడ నుంచి పువ్వాడ అజయ్ లేచి వెళ్లిపోయారు.
అలా వెళ్ళిపోతూ ఈద్గాని భవనాన్ని మంజూరు చేయించింది తానే అన్న విషయాన్ని మర్చిపోవద్దని ముస్లిం సోదరులకు సలహా ఇచ్చారు.
కాగా అనంతరం ఈద్గా సమీపంలో మీడియాతో మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడారు.
ముస్లింలకి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం మైనార్టీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తుమ్మల నాగేశ్వర స్పష్టం చేశారు.
