ఏసీబీ వలలో ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్

1500 రూ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సినియర్ అసిస్టెంట్
ఏసీబీ వలలో ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ఏసీబీ వలలో ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భూక్యా సోమ్లా
లైసెన్స్ జీరాక్స్ కాపీ ఇచ్చేందుకు రూ 1500 లంచం తీసుకుంటు ఉండగా పట్టుకున్న ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్
ఖమ్మం జిల్లా ఎక్సైజ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికాడు సీనియర్ అసిస్టెంట్ భూక్య సోమ్లా నాయక్.
బార్ లైసెన్సుకి చెందిన జిరాక్స్ కాఫీ కోసం జిల్లా ఎక్సైజ్ ఆఫీస్ లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ భూక్య సోమ్లా నాయక్ రూ. 1500 డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ డీఎస్పీ రమేష్.
బాధితుడి ఫిర్యాదు మేరకు ముందస్తు ప్లాన్ ప్రకారం ఎక్సైజ్ కార్యాలయంలో సోమ్లా నాయక్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
సోమ్లా నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
2025లో ఇప్పటివరకు 6 కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
అధికారులు ఎవరైనా డబ్బులు అడుగుతే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాల్సిందిగా ఏసీపీ డీఎస్పీ రమేష్ కోరారు.
