✕
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ... పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు
By Ck News TvPublished on 2 April 2025 11:20 AM IST
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ... పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు

x
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ... పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు
వైరాలోని మధిర క్రాస్ రోడ్ లో మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న సంఘటనలో సుమారు పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ప్రయాణికులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు వైరా బస్టాండ్ లోకి వెళ్లేందుకు మధిర క్రాస్ రోడ్ నుంచి మధిర వైపు మల్లుతున్న సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ బస్సు మధ్య భాగంలో ఢీ కొట్టింది.
దీంతో బస్సులోని సుమారు పదిమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరగటంతో బస్సులోనే ప్రయాణికులు కొంత సేపు అయోమయానికి గురయ్యారు.
బస్సులోని ప్రయాణికులను వేరొక బస్సులో ఎక్కించి ఖమ్మం కు తరలించారు. స్వల్పంగా గాయపడిన క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేశారు.

Ck News Tv
Next Story