లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మెదక్‌ జీఎస్టీ అధికారి

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మెదక్‌ జీఎస్టీ అధికారి

మరో అవినీతి తిమింగలం దొరికింది.మెదక్ జీఎస్టీ సూపర్ డెంట్ రవి రాజన్ అగర్వాల్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

జీఎస్టీ శాఖలో ఉన్నతాధికారిగా చెలామణి అవుతున్న రవి రాజన్‌ అగర్వాల్‌పై అవినీతి ఆరోపణలున్నాయి. ఈ ఘటన శుక్రవారం మెదక్‌లో జరిగింది. సీబీఐలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ ధనుంజయ్‌ నేతృత్వంలోని బృందం మెదక్‌లోని సెంట్రల్‌ జీఎస్టీ మెదక్‌ రేంజ్‌ కార్యాలయంలో శుక్రవారం దాడులు నిర్వహించారు.

పెద్దశంకరంపేట మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన తలారి కృష్ణమూర్తి మండల కేంద్రంలో ఎలక్ట్రికల్స్‌ హార్డ్‌వేర్‌ దుకాణం నిర్వహిస్తున్నారు.

2024 డిసెంబరులో అతని జీఎస్టీ నంబరు సస్పెండ్‌ కావడంతో మెదక్‌ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరంజన్‌ అగర్వాల్‌ను కలిశారు. పునరుద్ధరణకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ విషయమై బాధితుడు సీబీఐ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో శుక్రవారం స్థానిక జీఎస్టీ రేంజ్‌ కార్యాలయంలో పర్యవేక్షకులు రవిరంజన్‌ అగర్వాల్‌కు రూ.8,000 లంచం ఇస్తుండగా సీబీఐ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు.

Updated On 22 March 2025 10:17 AM IST
Ck News Tv

Ck News Tv

Next Story