సభలోనే కన్నీళ్ళు పెట్టుకున్న మంత్రి తుమ్మల...

సభలోనే కన్నీళ్ళు పెట్టుకున్న మంత్రి తుమ్మల... (వీడియో వైరల్)

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సభలోనే భావోద్వేగానికి గురయ్యారు. వేదిక మీద మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది. తుమ్మలకు రాజకీయ నిర్దేశకుడు గాదె సత్యం ఇటీవలే మరణించగా.. "ఓ కర్మ యోగీ" పేరుతో సంతాప సభ నిర్వహించారు.

ఈ సంతాప సభలో ప్రసగించిన మంత్రి తుమ్మల.. గాదె సత్యంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రసంగిస్తూనే.. కన్నీళ్లు పెట్టుకున్నారు.

"ఈ నియోజవర్గ రాజకీయాల్లో, జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు రావటానికి సహకరించినటువంటి పెద్దల్లో వెంకయ్య, సీతారామయ్య లాంటి వాళ్లు ముఖ్యులు.

రాజకీయాలలో నన్ను ప్రోత్సహించి, రాజకీయాల్లో ఏ రకంగా మనం వెళ్లగలుగుతామో దిశా నిర్దేశం చేస్తూ నన్ను నడిపించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు తనకు అన్నీ తానై నడిపించిన సత్యం.. నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు.

ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాను. మంచంలో ఉన్నా కూడా నాకు సలహా ఇచ్చేటువంటి శక్తి ఆయనకు తప్ప మరెవరికీ లేదు. ఆయన సలహా ప్రకారమే నా రాజకీయ నడవడిక జరిగింది.

నాకు భగవంతుడు, ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి శక్తి మేరకు ఆయన ఆలోచనకు అనుగుణంగానే.. కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఆయన లేకపోవడం నా భవిష్యత్ రాజకీయాలకు, ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. అటువంటి మనుషులు ఈనాటి కాలంలో ఉండటం అరుదు.

ఇప్పుడు ఆయన కూడా లేకపోవటం.. చాలా బాధకలిగించే విషయం. ఆయన ఆలోచనలు మనసులో పెట్టుకుని.. అందుకు అనుగుణంగానే ముందుకెళ్తాను." అంటూ తుమ్మల నాగేశ్వర రావు ప్రసంగించారు.

Ck News Tv

Ck News Tv

Next Story