అధికార మదంతో మాపై తప్పుడు కేసులు పెట్టలేదా..?

కబ్జాల నాగరాజు..నీ అక్రమాల లెక్క తేలుస్తాం..

ఆటో డ్రైవర్ వి నీకు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి..

నీ కబ్జాలు, దందా వల్లనే బీఆర్ఎస్ పతనం అయింది

అధికార మదంతో మాపై తప్పుడు కేసులు పెట్టలేదా..?

బీఆర్ఎస్ నేత పగడాల నాగరాజు పై

కాంగ్రెస్ నేతలు ముస్తాఫా, మిక్కిలినేని నరేంద్ర ఫైర్

ఖమ్మం, మార్చి 03

కబ్జాల నాగరాజు నీ అక్రమాల లెక్క తేలుస్తాం... నీ భూకబ్జాల గుట్టు విప్పుతాం... కేవలం ఆటో డ్రైవర్గా జీవనం ప్రారంభించిన నీవు వందల కోట్లలో ఎలా సంపాదించగలిగావు... చెమటోడ్చావా..? రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించావా? ఏం పని చేసి సాధించావు..? నీ కబ్జాలు నీ భూ దందాల వలనే కదా బి.ఆర్.ఎస్ పార్టీ పతనమైంది... ఆనాడు అధికారం ఉందన్న మదంతో మాపై తప్పుడు కేసులు పెట్టలేదా...? మాపై పిడి యాక్ట్ పెట్టి... రౌడీషీట్లు పెట్టించి... మమ్మల్ని జైల్లోకి పంపలేదా...? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముస్తఫా మిక్కిలి నరేంద్ర బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పై ద్వజమెత్తారు. సోమవారం సాయంత్రం ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు టిఆర్ఎస్ నేత పగడాల నాగరాజు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో కబ్జాలకు కేరఫ్ గా నాగరాజు జీవనాన్ని కొనసాగించారు అన్న విషయం నగర ప్రజలకు తెలుసు అని అన్నారు. గట్టయ్య సెంటర్లో 500 గజాల స్థలం ఆక్రమించి 57వ డివిజన్లో ఏడు కోట్ల విలువ చేసి అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టి పంచాయతీ కోసం వచ్చిన ఓ పబ్లిక్ స్కూల్ కు చెందిన వ్యక్తి వద్ద నుండి 1000 గజాలు కాజేసిన చరిత్ర నీది. ఎన్ ఎస్ పీ శివాలయం నిర్మాణం పేరుతో రూ. 70 లక్షలు వసూలు చేసి అన్యాయంగా సంపాదించిన హీనమైన జీవితం నీదనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి నుండి అన్యాయంగా రూ. 60 లక్షలు విలువ చేసే భూమిని కాజేసి నేటికీ వారిని న్యాయస్థానాల వరకు తిరిగేలా చేసావు. అధికారంలో ఉన్నప్పుడు రాజయోగాలు అనుభవించి అన్యాయంగా మాపై డివిజన్లో తిరిగినా తప్పుడు కేసులు పెట్టించి నిర్బంధాల గురి చేసి పైశాచిక ఆనందం పొందావని విమర్శించారు. తనపై 26 తప్పుడు కేసులు, తన సతీమణి పై 7 తప్పుడు కేసులు పెట్టించావని గుర్తు చేశారు. ఇకనైనా చౌకబారు విమర్శలు మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతాం నీ అక్రమాల గుట్టు విప్పి ప్రజల ముందు ఉంచుతాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నిన్ను కబ్జా కోరుగా గుర్తించి కేసులు నమోదు చేసి జైలుకు పంపింది. ఈ విషయం జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలుసు అని విమర్శించారు.

సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు భూమిని కాజేసి కటకటాల పాలైన హీనమైన చరిత్ర నీది అని విమర్శించారు.

నేను కబ్జా కానీ, భూ దందా కానీ, ఒక్కరి వద్ద పంచాయతీ చేసి ఒక్క రూపాయి తీసుకున్నా అని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధం అని కాంగ్రెస్ నేత ముస్తఫా సవాల్ విసిరారు.

ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్న అంటున్నాడు, ఖాళీగా తిరుగుతుంటే తనకు ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేశా, కుదరక తన డబ్బులు తనకు ఇచ్చేశా అని సమాధానం ఇచ్చారు.

రాంబాయి అనే మహిళ ఇంటి విషయం గతంలోనే ప్రెస్ క్లబ్ లో మేము ప్రెస్ మీట్ పెట్టాం, వాస్తవాన్ని వివరించామని తెలిపారు.

పగడాల నాగరాజు అపార్ట్మెంట్ విషయంలో సీరియస్ గా పని చేస్తుంటే దానిని తప్పుదోవ పట్టించేందుకు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించారు. నేను కారులో తిరుగుతుంటే నువ్వు ఆటో తొలుతున్నావ్, నా ఇంటికి వచ్చి రెండు వేలు తీసుకుంది నువ్వు కాదా అని గుర్తు చేశారు.

సుపారి డబ్బులు తీసుకుని హత్యలు చేసింది నువ్వు, నన్ను రౌడీ షీటర్ అంటావా..? అని ప్రశ్నించారు. ప్రజలు నిన్ను ఎందుకు ఓడిపించారు, నన్ను ఎందుకు గెలిపించారో గుర్తుంచుకో అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొప్పెర ఉపేందర్ 57 డివిజన్ చెందిన నాగరాజు బాధితులు తదితరులు పాల్గొన్నారు.

Ck News Tv

Ck News Tv

Next Story