మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి

నాయకన్ గూడెం రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించండి
మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి
క్షతగాత్రులను కాపాడిన మంత్రి
- ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
కూసుమంచి : కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాయకన్ గూడెం గ్రామం నుంచి మిరపతోటకు కూలీలతో వెళ్తున్న ప్యాసింజర్ ఆటోను అదే ప్రాంతంలో అతివేగంగా వస్తున్న ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అవ్వగా.... మరో పది మందికి స్వల్పగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు.
విషయం తెలుసుకున్న పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను మంత్రి ఆదేశించారు. ఘటన పై విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.
