'మంత్రి పొంగులేటి చొరవతో పాలేరు'కు మహర్దశ

'మంత్రి పొంగులేటి చొరవతో పాలేరు'కు మహర్దశ

- రూ.45.50కోట్ల వ్యయంతో 100పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు

- మంత్రి పొంగులేటి చొరవతో జీవో ఆర్ టీ నెం. 68 విడుదల చేసిన ప్రభుత్వం

- హర్షం వ్యక్తం చేస్తున్న పాలేరు నియోజకవర్గ ప్రజలు

పాలేరు : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పాలేరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుంది. ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాలకు నూతన భవనం.. కూసుమంచిలో కొత్త జూనియర్ కళాశాల.... ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో నర్సింగ్ కళాశాల... పొన్నెకల్ లో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల... నియోజకవర్గంలోని ఆయా ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు.... ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటు... ఇలా చెప్పుకుంటూ పోతే గడిచిన 15 నెలల కాలంలో పాలేరు నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. పాలేరు నియోజకవర్గ అభివృద్దే ఏకైక లక్ష్యంగా అడుగులు వేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తాజాగా కూసుమంచి కేంద్రంగా 100పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేయించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు 100పడకల ఆసుపత్రి మంజూరు చేయిస్తానని ఇచ్చిన హామీ మేరకు మంత్రి పొంగులేటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలోనే హామీని నెరవేర్చారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 24వ తేదీన రూ.45.50కోట్ల వ్యయంతో 100పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తూ జీవో ఆర్ టి నెం.68 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో పాలేరు నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఆసుపత్రిని మంజూరు చేయించిన మంత్రి పొంగులేటికి పాలేరు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Ck News Tv

Ck News Tv

Next Story