ఆశా వర్కర్ల యూనియన్ సీఐటీయు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ఆశా వర్కర్ల యూనియన్ సీఐటీయు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

సి కె న్యూస్ ప్రతినిధి ఖమ్మం

సోమవారం రోజు ప్రశాంతంగా హైదరాబాద్లో నిరసన ర్యాలీ చేస్తున్న ఆశా వర్కర్ల ను అక్రమంగా అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లో నిర్బంధించారు.పోలీసులు అరెస్టులు చేసె సందర్భంగా ఆశా వర్కర్ల కు కొంతమంది కి గాయాలు అయ్యాయి.

పొలీసులు అక్రమ అరెస్టులకు ఖండిస్తూ ఖమ్మం జడ్పీ సెంటర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.


అనంతరం జరిగిన సభలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పిన్నింటి రమ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆశా వర్కర్స్ లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడగటానికి వెళ్ళిన ఆశా వర్కర్లను రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేసి హైదరాబాద్లో ఆశా వర్కర్లు అని చూడకుండా కొట్టి అరెస్టు చేయాటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రశ్నించే వారిని చూస్తె బయపడుతున్నారు.పోలీసులతొ అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు.ఇప్పటికైన ప్రభుత్వం ఆశా యూనియన్ నాయకులతో చర్చలు జరిపి వారి సమస్యలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని 18000 ఫిక్స్డ్ వేతనం అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించాలని డిమాండ్.ఈ

కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ జిల్లా నాయకులు ఝాన్సీ రమ్య విజయ నిర్మల వెంకటరామమ్మ శశిరేఖ పద్మ విజయ తదితరులు పాల్గొన్నారు

Ck News Tv

Ck News Tv

Next Story