పరీక్ష రాస్తూ ఫిట్స్‌తో పడిపోయిన SSC విద్యార్థి

పరీక్ష రాస్తూ ఫిట్స్‌తో పడిపోయిన SSC విద్యార్థి

నేలకొండపల్లి: ఎస్సెస్సీ పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి పిట్స్‌తో పడిపోగా, చికిత్స చేయించి ఉపాధ్యాయులు ఆతర్వాత పరీక్ష రాయించారు.

మండలంలోని రాయగూడెం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బోయిన ధనుష్‌ చెరువుమాధారం పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు.

పరీక్ష ప్రారంభమైన అరగంటకు ఆయన ఫిట్స్‌తో పడిపోగా స్థానికంగా చికిత్స చేయించినా ఫలితం లేక 108లో నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్‌ రాజేష్‌ చికిత్స చేశాక పరీక్ష ఉందని చెప్పడంతో సైలెన్‌ బాటిల్‌తో ధనుష్‌ను పంపించారు.

పరీక్ష పూర్తయ్యాక మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు చేయించగా ఎంఈఓ బి.చలపతిరావు, ఎంపీడీఓ ఎం.యర్రయ్య ఆయనను పరామర్శించారు.

Ck News Tv

Ck News Tv

Next Story