మానవత్వం చాటుకున్న టీయూ డబ్ల్యూజె (టీజేఎఫ్) బృందం
మానవత్వం చాటుకున్న టీయూ డబ్ల్యూజె (టీజేఎఫ్) బృందం

మానవత్వం చాటుకున్న టీయూ డబ్ల్యూజె (టీజేఎఫ్) బృందం
కిడ్నీల సమస్యతో బాధపడుతున్న జర్నలిస్టుకు రూ.20 వేల ఆర్థిక సహాయం
గత కొన్ని రోజులుగా కిడ్నీల వ్యాధి సమస్యతో బాధ పడుతున్న
ఖమ్మం నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పేరబోయిన తిరుపతి రావు కు టీయూ డబ్ల్యూజె
(టీజేఎఫ్)యూనియన్ అండగా నిలిచి మానవత్వం చాటుకుంది. జర్నలిస్టు అనారోగ్య పరిస్థితిని తెలుసుకున్న టీయూ డబ్ల్యూజె (టీజేఎఫ్) బృందం శుక్రవారం ఖమ్మం నగరంలోని ప్రశాంతి నగర్ లో నివసిస్తున్న తిరుపతి రావు స్వగృహానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు.వైద్య ఖర్చుల నిమిత్తం జర్నలిస్టు కుటుంబానికి
రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆరోగ్య పరంగా
ఎలాంటి సమస్య వచ్చిన యూనియన్ దృష్టికి తీసుకురావాలని,తక్షణమే పరిష్కరించి అండగా నిలుస్తామని జర్నలిస్టు కుటుంబానికి భరోసా కల్పించారు. అంతే కాకుండా తిరుపతి రావుకు వైద్యం అందిస్తున్న డాక్టర్ ను ఫోన్ ద్వారా సంప్రదించి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. పరామర్శించిన వారిలో
టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి, జాతీయ కౌన్సిల్ సభ్యులు వెన్నెబోయిన సాంబశివరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి, టిఎస్ చక్రవర్తి, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు వనం నాగయ్య, జిల్లా నాయకులు ఉదయ్, మందుల ఉపేందర్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గుద్దేటి రమేష్ బాబు, కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగదీష్, కరీషా అశోక్, ఆర్ టివి శేఖర్, మహిళా ప్రతినిధి వంగూరి ఈశ్వరి, వెంకటకృష్ణ, ఆంథోటీ శ్రీనివాస్,హరీష్, పాశం వెంకటేశ్వర్లు, పొన్నెబోయిన పానకాలరావు, బాబు, వెంకటేశ్వర రెడ్డి, ఇస్సంపల్లి వెంకటేశ్వర్లు, అప్పారావు, పి సి డబ్ల్యూ నరేష్, అక్షర విక్షణం రమేష్, ప్రజా వాక్యం వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.
ఫోన్ లో పరామర్శించిన రాష్ట్ర మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ....
జర్నలిస్టు తిరుపతి రావు అనారోగ్య పరిస్థితిని జిల్లా నాయకత్వం,రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగానే తక్షణమే
స్పందించిన రాష్ట్ర మాజీ ప్రెస్ అకాడెమీ చైర్మన్, టీయూ డబ్ల్యూజె(టీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ లు శుక్రవారం తిరుపతి రావు కు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని జర్నలిస్టుకు సూచించారు. ఆరోగ్య సమస్య తీవ్రతరమైన,హాస్పిటల్ వైద్యం విషయంలో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
