అండర్‌17 క్రికెట్‌ కప్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

అండర్‌17 క్రికెట్‌ కప్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

పోస్టర్‌ ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్‌ బిష్ణుదేవ్‌ వర్మ

24 నుంచి అమెరికా జట్టుతో తెలంగాణ రూరల్‌ జట్ల ఢీ

హైదరాబాద్‌, 28 ఫిబ్రవరి 2025 :

అమెరికా యూత్‌ క్రికెట్‌ అకాడమి, ది తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ-రూరల్‌) క్రికెట్‌ జట్ల మధ్య మార్చి 24 నుంచి అండర్‌-17 క్రికెట్‌ కప్‌ జరుగనుంది. అమెరికా యూత్‌ టీమ్‌తో పాటు తెలంగాణ ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపిక చేసిన మూడు జట్లు ఈ టోర్నమెంట్‌లో పోటీపడుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ బిష్ణుదేవ్‌ వర్మ శుక్రవారం సోమాజిగూడలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అండర్‌-17 క్రికెట్‌ కప్‌ పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. అమెరికా జట్టుతో క్రికెట్‌ టోర్నమెంట్‌తో తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు అంతర్జాతీ స్థాయి పోటీల అనుభవం దక్కనుందని ఈ సందర్భంగా గవర్నర్‌ బిష్ణుదేవ్‌ వర్మకు తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ- రూరల్) వ్యవస్థాపక అధ్యక్షులు అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి వివరించారు.

నాలుగు జట్లు పోటీపడుతున్న అండర్‌-17 క్రికెట్‌ కప్‌ టోర్నమెంట్‌ 50 ఓవర్ల ఫార్మాల్‌లో నిర్వహిస్తున్నారు. మార్చి 24న ఎల్బీ స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌కు గవర్నర్‌ బిష్ణుదేవ్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. టోర్నమెంట్‌లో మొత్తం ఏడు మ్యాచులు షెడ్యూల్‌ చేయగా.. ఇతర మ్యాచులు సహా ఫైనల్‌కు శంషాబాద్‌ సమీపంలోని ఎంపీఎస్‌ క్రికెట్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు.

అండర్‌-17 క్రికెట్‌ కప్‌ పోస్టర్‌ ఆవిష్కర కార్యక్రమంలోఅమెరికన్‌ యూత్‌ క్రికెట్‌ అకాడమీ ప్రెసిడెంట్‌ అరుణ్‌ కొలిపాక, అమెరికా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి. సత్యనారాయణ్ రెడ్డి సహా తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ-రూరల్‌) జిల్లాల కన్వీనర్లు నవాజ్‌, రాఘవరెడ్డి, షేక్‌ రహీమ్‌, సురేశ్‌, మథీన్‌, శరత్‌ యాదవ్‌, భాగ రెడ్డి, నర్వోత్తమ రెడ్డి, సంతోశ్‌, జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ck News Tv

Ck News Tv

Next Story